
నిజామాబాద్, వెలుగు: స్కూల్ స్డూడెంట్స్ను సొంత బిడ్డల్లా భావించి వారి భవిష్యత్‌ను టీచర్లు తీర్చిదిద్దాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు కోరారు. గురువారం నగరంలోని హెచ్‌పీఎస్‌లో కొనసాగుతున్న గవర్నమెంట్ టీచర్ల ట్రైనింగ్ శిబిరాన్ని పరిశీలించి మాట్లాడారు.
టీచింగ్ సామర్థ్యాన్ని పెంచడానికి శిక్షణ ఇస్తున్నామని, స్టూడెంట్స్‌కు అర్థమయ్యే రీతిలో పాఠాలు చెప్పడానికి ఇది దోహదపడుతుందన్నారు. మ్యాథ్స్, ఇంగ్లిష్ సబ్జెక్ట్లపై స్టేట్ రిసోర్స్పర్సన్లు ఇస్తున్న ట్రైనింగ్‌ను కలెక్టర్ పరిశీలించారు. డీఈవో అశోక్ తదితరులు ఉన్నారు.