
నిజామాబాద్, వెలుగు: జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న గ్రామపాలనాధికారి (జీపీవో) పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. శనివారం సీసీఎల్ఏ నవీన్ మిట్టల్‌తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ జిల్లా డేటా వివరించారు. గవర్నమెంట్గిరిరాజ్ డిగ్రీ కాలేజీలో సెంటర్ ఏర్పాటు చేశామని, 331 మంది హాజరుకానుండగా ప్రతి రూమ్‌లో 32 మంది అభ్యర్థులు పరీక్ష రాసేలా ఏర్పాటు చేశామన్నారు.
ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.3గంటల వరకు పరీక్ష ఉంటుందని, సకాలంలో ఆర్టీసీ బస్సులు నడుపుతామన్నారు. అడిషనల్ కలెక్టర్ కిరణ్‌కుమార్, అడిషనల్డీసీపీ బస్వారెడ్డి, ఆర్డీవో రాజేంద్రకుమార్, కాలేజీ ప్రిన్సిపాల్ మోహన్, ఏవో ప్రశాంత్, తహసీల్దార్ బాలరాజు పాల్గొన్నారు.
జూన్‌లో మూడు నెలల బియ్యం పంపిణీ
జిల్లాలోని రేషన్ కార్డులపై జూన్‌లో ఒకేసారి మూడు నెలల రైస్ పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు తెలిపారు. వర్షాలు, వరదలు, బియ్యం స్టాక్ పెట్టే సమస్యను గమనంలోకి తీసుకొని గవర్నమెంట్ ఆదేశాల మేరకు, జూన్, జులై, ఆగస్టు నెల కోటా ఒకేసారి అందిస్తామన్నారు.