గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెంపు : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెంపు : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

జనగామ అర్బన్, వెలుగు: వలసలను నిరోధించడానికి గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామీణ శ్రేయస్సు స్థితిస్థాపకత కార్యక్రమానికి జనగామ జిల్లా ఎంపికైందని కలెక్టర్​ రిజ్వాన్​ భాషా షేక్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 2025 బడ్జెట్ లో ప్రకటించిన ఈ కార్యక్రమానికి జిల్లా ఎంపికైన నేపథ్యంలో కలెక్టరేట్​లోని కాన్ఫరెన్స్​హాల్లో మంగళవారం రూరల్ డెవలప్​మెంట్​జాయింట్​సెక్రటరీకి కలెక్టర్​ పవర్​ పాయింట్​ప్రజెంటేషన్​ ద్వారా జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న స్థితిగతులను వివరించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ శ్రామిక శక్తికి కొత్త నైపుణ్యాలను అందించడం, ఆయా ప్రాంతాల్లో పెట్టుబడులను ప్రోత్సహించడం, వ్యవసాయం, ఇతర గ్రామీణ సంస్థలను మెరుగుపరచడానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను స్వీకరించడం తదితర అంశాలకు సంబంధించిన కార్యక్రమాలను చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ మహిళలు, రైతులు, యువత, భూమిలేని కుటుంబాలు లబ్ధిపొందనున్నట్లు తెలిపారు.