ఆధునిక వసతులతో పోలీస్‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌ .. మోడల్‌‌‌‌‌‌‌‌ పీఎస్‌‌‌‌‌‌‌‌కు భూమి పూజ చేసిన కలెక్టర్, ఎస్పీ

ఆధునిక వసతులతో పోలీస్‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌  .. మోడల్‌‌‌‌‌‌‌‌ పీఎస్‌‌‌‌‌‌‌‌కు భూమి పూజ చేసిన కలెక్టర్, ఎస్పీ

వీర్నపల్లి, వెలుగు: ఆధునిక వసతులతో కొత్త పోలీస్‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌ను నిర్మిస్తున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేశ్‌‌‌‌‌‌‌‌ బి.గీతే తెలిపారు. శనివారం వీర్నపల్లి మండల కేంద్రంలో మోడల్ పోలీస్‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌కు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న వీర్నపల్లి మండలాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చర్యలు తీసుకుంటున్నామన్నారు. బాధితులకు న్యాయం చేకూర్చేలా పోలీసులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. 

ఎస్పీ మాట్లాడుతూ వీర్నపల్లి మండల ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో అన్ని హంగులతో పోలీస్‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌ నిర్మాణం ప్రారంభించినట్లు చెప్పారు. అనంతరం రంగంపేట గ్రామ శివారులోని జంపన్న వాగును సందర్శించారు. వాగులో పూడిక తీసి నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కేకే మహేందర్ రెడ్డి, సీఐ శ్రీనివాస్, ఎస్ఐలు లక్ష్మణ్, ఎల్లగౌడ్, రమాకాంత్, రాహుల్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ రాములునాయక్, సెస్ డైరెక్టర్ మల్లేశం, పాల్గొన్నారు. 

ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక కొరత లేదు 

రాజన్నసిరిసిల్ల, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఇసుక కొరత లేదని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పష్టం చేశారు. తంగళ్లపల్లి ఎంపీడీవో ఆఫీసులో జిల్లెల్ల గ్రామానికి చెందిన 26 మంది లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పైలట్ ప్రాజెక్టులో భాగంగా రాళ్లపేటలో నిర్మిస్తున్న ఇండ్ల నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ స్వరూప, వైస్ చైర్మన్ నర్సింగం, హౌసింగ్ పీడీ శంకర్, డీపీవో షర్ఫుద్దీన్, ఎంపీడీవో లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.