V6 News

పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

జనగామ అర్బన్, వెలుగు: భూ భారతి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, సాదాబైనామా పరిష్కారంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. గురువారం  కలెక్టరేట్‌‌‌‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌‌‌‌లో భూ భారతి, సాదాబైనామా పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై అడిషనల్ కలెక్టర్ బెన్ షాలోమ్‌‌‌‌తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.  

భూ భారతి వ్యవస్థలోని వివిధ మాడ్యూల్స్​లో ఉన్న సక్సెషన్, మ్యుటేషన్, ఖాతా సమీకరణ, డేటా కరెక్షన్, అర్బన్ ల్యాండ్, కోర్టు కేసులు, జీపీపీ, పీపీబీ, నాలా తదితర అంశాలకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అనంతరం  ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌‌‌‌ఐఆర్)   ప్రక్రియపై ఆర్టీవోలు, తహసీల్దార్లతో   సమీక్ష సమావేశం నిర్వహించారు.   ఈ సమీక్ష సమావేశంలో ఆర్డీవోలు గోపీరాం, వెంకన్న, ఎన్నికల సూపరింటెండెంట్ శ్రీధర్, తహసీల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.