
తంగళ్లపల్లి, వెలుగు: అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, సిరిసిల్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలోని ఓ గార్డెన్స్‌లో లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని అన్నారు. అనంతరం ఎంపీడీవో ఆఫీస్‌లో రైతులకు పాడి బర్రెలను పంపిణీ చేశారు.
అంతకుముందు చీర్లవంచ గ్రామంలో కొత్తగా నిర్మించిన అంగన్‌వాడీ కేంద్రాల భవనాలను ప్రారంభించారు. వారి వెంట ఆర్డీవో వెంకటేశ్వర్లు, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజ్యం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న, పశు సంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, ఏఎంసి చైర్మన్, వైస్ చైర్మన్ నర్సింగం గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు టోనీ పాల్గొన్నారు.