రైతులకు ఉత్తమ సేవలు అందించాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రైతులకు ఉత్తమ సేవలు అందించాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల/ఎల్లారెడ్డిపేట, వెలుగు:  డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఎక్స్‌‌‌‌‌‌‌‌టెన్షన్‌‌‌‌‌‌‌‌ సర్వీస్ ఫర్ ఇన్‌‌‌‌‌‌‌‌పుట్(డీఏఈఎస్ఐ ) కోర్సు పూర్తి చేసిన డీలర్లు రైతులకు ఉత్తమ సేవలందించాలని కలెక్టర్​ సందీప్ కుమార్​ ఝా సూచించారు. మంగళవారం కోర్సు పూర్తి చేసుకున్న 40 మంది డీలర్లకు కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో సర్టిఫికేట్స్‌‌‌‌‌‌‌‌ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సమగ్ర తెగులు నిర్వహణ పద్ధతులు, వ్యవసాయ పనిముట్లు, యంత్రాలపై పరిచయం, విస్తరణ విధానాలపై వివరించేందుకు డీలర్లకు మెలకువలు నేర్పించారన్నారు. 

అంతకుముందు జిల్లాకేంద్రంలోని సుందరయ్య నగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్  తనిఖీ చేశారు. అనంతరం ఎల్లారెడ్డిపేట మండలంలో పర్యటించారు. అల్మాస్‌‌‌‌‌‌‌‌పూర్ గ్రామంలోని కేజీబీవీ హాస్టల్‌‌‌‌‌‌‌‌ను తనిఖీ చేశారు.  హాస్టల్‌‌‌‌‌‌‌‌లో స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌కు ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఎస్‌‌‌‌‌‌‌‌కే టీం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైద్య పరీక్షల క్యాంపును పరిశీలించారు. ఎల్లారెడ్డిపేటలోని ప్యాక్స్‌‌‌‌‌‌‌‌ గోదాం, గొల్లపల్లిలోని పలు ఫర్టిలైజర్స్‌‌‌‌‌‌‌‌ షాపులను తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట కార్యక్రమంలో డీఏవో అఫ్జల్ బేగం, ఎంఈవో కృష్ణహరి, తదితరులు ఉన్నారు.