
జగిత్యాల రూరల్, వెలుగు: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. గురువారం జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలోని పీహెచ్‌సీని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. డెంగ్యూ, మలేరియా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన మెడిసిన్ అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొన్నారు.
హాస్పిటల్ ఆవరణలోని పిచ్చి మొక్కలు, ముళ్ల చెట్లు తొలగించి శానిటేషన్ చేయించాలని అధికారులను ఆదేశించారు. ఓపీ, ల్యాబ్ రికార్డ్స్, మెడికల్ ఫార్మసీ రిజిస్టర్ పరిశీలించారు. డాక్టర్లు సమయపాలన పాటించాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీవో మధుసూదన్, డీఎంహెచ్‌వో ప్రమోద్ కుమార్, పీహెచ్‌సీ డాక్టర్ సౌజన్య పాల్గొన్నారు.