సమ్మర్ లో తాగునీటి ఇబ్బందులు రావొద్దు : శశాంక

సమ్మర్ లో తాగునీటి ఇబ్బందులు రావొద్దు : శశాంక

ఎల్ బీనగర్,వెలుగు: వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్ లో  మిషన్ భగీరథ, పంచాయతీ రాజ్,  నీటిపారుదల శాఖల అధికారులతో తాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహించి మాట్లాడారు. సమ్మర్ లో తాగునీటి ఇబ్బందులు వచ్చే ప్రాంతాలను గుర్తించి, పరిష్కారానికి ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

 పంచాయతీల్లో సరఫరాకు అంతరాయం లేకుండా అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండి చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందుకు సమ్మర్ యాక్షన్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌ రూపొందించాలని పేర్కొన్నారు. పని చేయని బోర్లు, పంపు సెట్ల్, చెరువులు వంటివి ముందస్తుగానే గుర్తించి మరమ్మతులు చేయించాలన్నారు.  క్రిటికల్ పోజిషన్ లో  ఉన్న గ్రామాలను, ఇప్పటికి నీరు అందని ఇండ్లను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

  క్షేత్ర స్థాయిలో ప్రజా ప్రతినిధులు లేరని, అధికారులే పంచాయతీ ప్రత్యేక అధికారులుగా ఉండడంతో బాధ్యత చాలా ఉందని కలెక్టర్ తెలిపారు. అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నర్సరీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి  పెంచే మొక్కలు ఎండిపోకుండా నీరు అందించి  సంరక్షించేలా కార్యాచరణ చేపట్టాలని పేర్కొన్నారు.