ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో పరిహారం డిలే కావద్దు : కలెక్టర్‌‌ సిక్తా పట్నాయక్‌‌

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో పరిహారం డిలే కావద్దు : కలెక్టర్‌‌ సిక్తా పట్నాయక్‌‌

హనుమకొండ, వెలుగు : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు పరిహారం ఇవ్వడంలో ఆలస్యం చేయొద్దని హనుమకొండ కలెక్టర్‌‌ సిక్తా పట్నాయక్‌‌ సూచించారు. హనుమకొండ కలెక్టరేట్‌‌లో గురువారం జరిగిన జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్‌‌ కమిటీ మీటింగ్‌‌లో ఆమె మాట్లాడారు. ఇప్పటివరకు అందిన ఫిర్యాదుల పరిష్కారానికి రెవెన్యూ, పోలీస్‌‌ ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వచ్చే మీటింగ్‌‌లో తెలియజేయాలని ఆదేశించారు. ప్రతి మూడు నెలలకోసారి మానిటరింగ్ కమిటీ మీటింగ్‌‌ నిర్వహించి

బాధితులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే ప్రతి నెల 30న గ్రామాల్లో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ భూములు, చెరువుల ఆక్రమణలపై ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సమావేశంలో జడ్పీ చైర్మన్‌‌ డాక్టర్‌‌ సుధీర్‌‌కుమార్‌‌, అడిషనల్‌‌ కలెక్టర్‌‌ రాధిక గుప్తా

వరంగల్‌‌ సెంట్రల్‌‌ జోన్‌‌ డీసీపీ ఎంఏ.బారి, ట్రైనీ ఐపీఎస్‌‌ శుభం నాగరాలె, హనుమకొండ ఆర్డీవో రమేశ్‌‌, ఏసీపీలు డేవిడ్‌‌రాజ్‌‌, సతీశ్‌‌బాబు, కిశోర్‌‌కుమార్‌‌, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు పుట్ట రవి, ఈవీ శ్రీనివాస రావు, డాక్టర్ దామోదర్, చుంచు రాజేందర్ పాల్గొన్నారు.