పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం : కలెక్టర్ స్నేహ శబరీశ్

పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం : కలెక్టర్ స్నేహ శబరీశ్

ఎల్కతుర్తి, వెలుగు: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్​లోని జిన్నింగ్​ మిల్​లో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ స్నేహ శబరీశ్​ శుక్రవారం ప్రారంభించారు.‌ ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ రైతులు నాణ్యమైన పత్తిని తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని సూచించారు. 

కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మార్కెట్​అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సుకినె సంతాజీ, కాంగ్రెస్​మండలాధ్యక్షుడు ఎలిగేడి ఇంద్రసేనారెడ్డి, యూత్​ అధ్యక్షుడు అంబాల శ్రీకాంత్, అధికారులు రైతులు పాల్గొన్నారు.