వెరీ గుడ్.. సర్కారు బడిలో కలెక్టర్ పాఠాలు

వెరీ గుడ్.. సర్కారు బడిలో కలెక్టర్ పాఠాలు

స్కూల్ లో పాఠాలు టీచరే చెబుతారు. కానీ.. అక్కడి ప్రభుత్వ పాఠశాలలో ఓ కలెక్టర్ పాఠాలు చెప్పారు. అలా కొత్త సంప్రదాయం మొదలుపెట్టారు మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ జిల్లా కలెక్టర్.

భోపాల్ కలెక్టర్ తరుణ్ కేఆర్ పితోడే సడెన్ గా ప్రభుత్వ పాఠశాలలో కనిపించారు. రెగ్యులర్ గా ఆయన ఉండే కలెక్టరేట్ వదిలి.. భోపాల్ పట్టణంలోని అరెనా కాలనీలో ఉన్న సర్కారు బడికి వెళ్లారు. క్లాస్ రూమ్ లో పిల్లలకు గెస్ట్ లెక్చర్ ఇచ్చారు. పిల్లల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.

తాను ఒక కొత్త పద్ధతి మొదలుపెట్టాలనుకుంటున్నాననీ.. అందుకే ఇలా సర్కారుబడికి వెళ్లి పాఠాలు చెప్పాలనుకుంటున్నానని చెప్పారు కలెక్టర్ తరుణ్. టీచర్లు పాఠాలు మాత్రమే చెబుతారు..కానీ కలెక్టర్లు వాటికి అదనంగా సమాచారం, విజ్ఞానం పిల్లలకు అందించే వీలుందని చెప్పారు. ఎందుకంటే.. కలెక్టర్లుగా మారిన వాళ్లు.. ఎన్నో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ను దాటి వస్తారని.. ప్రాక్టికల్ గా రకరకాలైన  అనుభవాలను ఎదుర్కొంటారని చెప్పారు. అవన్నీ పిల్లలతో షేర్ చేసుకుంటే వారికి మరింతగా ఉపయోగపడతాయని అన్నారు. టీచర్లు చెప్పే పాఠాలకు .. తమ అనుభవాలను జోడించినప్పుడు… తప్పకుండా అవి పిల్లలకు పనికొస్తాయని అన్నారు.

ప్రభుత్వ స్కూళ్లకు తిరిగి ఆదరణ దక్కించడం, తమకున్న అనుభవాన్ని భావి పౌరులకు అందించడం.. ఈ రెండు ఉద్దేశాలతోనే తాను ఈ ఆలోచన చేశాననీ అన్నారు. ఇకనుంచి రెగ్యులర్ గా స్కూళ్లకు వెళ్లి ఆ పనిని చేస్తానని చెప్పారు కలెక్టర్ తరుణ్.