గరిడేపల్లి, వెలుగు: మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎలక్షన్ స్పెషల్ ఆఫీసర్లతో వెబ్ ఎక్స్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ స్టేషన్లలో మౌలిక సదుపాయాలు ఉన్నాయో లేవో చూసుకోవాలని, ఫెసిలిటేషన్, మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, వాహనాలు తదితర ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.
పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి స్టేజి–1 ఆర్వోలు 37ఎ రిజిస్టర్ లో సర్వీస్ ఓటర్ల వివరాలు, స్టేజి–2 ఆర్వోలు 37సి రిజిస్టర్ లో ఎన్నికలలో విధులు నిర్వహించే వారి వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని చెప్పారు. రిటర్నింగ్ అధికారులు సంబంధిత గ్రామ పంచాయతీలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించాలని సూచించారు. అడిషనల్కలెక్టర్ సీతారామారావు, డీపీవో యాదగిరి, డీఆర్డీఏ పీడీ వి.వి.అప్పారావు, డివిజినల్ పీవో నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
