హుజూర్ నగర్, వెలుగు: మార్చి ఫస్ట్ వీక్ లో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ కాలనీ ప్రారంభించనున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కాలనీ పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మంగళవారం హుజూర్ నగర్ శివారులో రామస్వామి గుట్ట వద్ద నిర్మాణంలో ఉన్న గృహసముదాయాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
కాలనీలో అంతర్గత రోడ్లు,డ్రైనేజీలు, విద్యుత్ సదుపాయం,మొక్కలు నాటడం లాంటి అన్ని పనులను పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్లను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలోమున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాసగౌడ్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జునరావు, హౌసింగ్ పీడీ సిద్ధార్థ, జిల్లా హార్టికల్చర్ అధికారి నాగయ్య, మిషన్ భగీరథ ఈఈ కరుణాకర్ రెడ్డి, తహసీల్దార్ కవిత, కాంట్రాక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.
