ఎన్నికల నిర్వహణలో సెక్టార్ అధికారులది కీలక బాధ్యత : కలెక్టర్​ వల్లూరు క్రాంతి

ఎన్నికల నిర్వహణలో సెక్టార్ అధికారులది కీలక బాధ్యత : కలెక్టర్​ వల్లూరు క్రాంతి

సంగారెడ్డి టౌన్, వెలుగు : ఎన్నికల నిర్వహణలో సెక్టార్  అధికారుల పాత్ర కీలకమని కలెక్టర్  క్రాంతి  పేర్కొన్నారు. కలెక్టరేట్లో బుధవారం జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాల్లోని సంగారెడ్డి, పటాన్ చెరువు పరిధి సెక్టార్ అధికారులకు పోలింగ్ నిర్వహణపై మాక్ పోల్  కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎల్ సీడీ ప్రొజెక్టర్ ద్వారా  మాక్ పోల్  డాక్యుమెంటరీని  ప్రదర్శించారు.  

ఈ సందర్భంగా కలెక్టర్​ క్రాంతి మాట్లాడుతూ  సెక్టార్ అధికారులు సాంకేతికతపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఎన్నికలు సజావుగా జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ ప్రారంభానికి 90 నిమిషాల ముందు ఎన్నికల ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించాలని సూచించారు.  ప్రతి సెక్టార్ అధికారి పరిధిలో 12 పోలింగ్ బూత్​లు ఉంటాయని, ఆయా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు

ఓటర్ లిస్టును  ముందుగా పరిశీలించాలన్నారు. పీఓలకు  ఏప్రిల్ 1న,  ఏపీఓలకు 2న ఎలక్షన్​ ట్రైనింగ్​ ఉంటుందని తెలిపారు. అనంతరం ఈవీఎంలు ఏర్పాటు చేసి మాక్ పోలింగ్ ను నిర్వహించారు. అడిషనల్​ కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డీఆర్ ఓ  పద్మజా రాణి, ఆర్డీఓలు, నోడల్ అధికారులు, ఎన్నికల సిబ్బంది హాజరయ్యారు.