
నిజామాబాద్, వెలుగు: జిల్లాలోని గవర్నమెంట్ హాస్టళ్లలో ఏమైనా సమస్యలుంటే రిపోర్టు చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆయన డిచ్పల్లి మండలం ధర్మారం (బీ) గ్రామాల్లోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాయ్స్ హాస్టల్‌ను పరిశీలించారు. స్టోర్ రూమ్‌లో నిల్వ ఉన్న సరుకులు చూసి శుభ్రత పాటించాలన్నారు.
మెనూ ప్రకారం భోజనం పెట్టాలని, టాయిలెట్స్ శుభ్రంగా ఉండాలన్నారు. టీచర్లందరూ సమయపాలన పాటించాలని, స్టూడెంట్స్‌కు వైద్య పరీక్షలు చేయించాలన్నారు.