
- కమ్మర్ పల్లి టు బోధన్ రోడ్డు పరిశీలించిన కలెక్టర్, సీసీ
- 77 కి.మీ మేర బ్లాక్ స్పాట్స్ గుర్తింపు
బాల్కొండ, వెలుగు : ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాల నివారణకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. మంగళవారం కమ్మర్ పల్లి టూ బోధన్ రోడ్డును కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, సీసీ సాయిచైతన్య పరిశీలించారు. 77 కి.మీ మేర 26 బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్లపై గుంతలకు మరమ్మతులు చేయాలని అధికారులకు సూచించారు. హైవేపై ఉన్న షాపులు, ప్రచార బోర్డులు, విగ్రహాలు వెనక్కి జరిపించాలన్నారు. గ్రామాల్లో జీబ్రా క్రాసింగ్ లైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు.
మూల మలుపుల వద్ద రోడ్లు విశాలంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్మూర్ రహదారిపై కారు ఆక్సిడెంట్ ఘటన దృశ్యాన్ని తిలకించారు. ప్రజల సహకారంతో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఎన్ హెచ్ ఈఈ మల్లారెడ్డి, ప్రాజెక్ట్డైరెక్టర్ అజయ్, ఆర్టీఏ ఆఫీసర్ ఉమామహేశ్వరరావు, ఆర్అండ్ బీ ఏఈ సతీశ్, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఆర్మూర్, బోధన్ ఏసీపీలు వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్, ఐఆర్ఏడీ వర్షా,108 జిల్లా ఇన్చార్జి రామలింగేశ్వర రెడ్డి, ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
‘భూభారతి’ దరఖాస్తులలో జాప్యం వద్దు..
భూభారతి’ దరఖాస్తులను పరిష్కరించడంలో జాప్యం చేయవద్దని వినయ్‌కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, జిల్లా పరిషత్ హైస్కూల్, ప్రైమరీ స్కూల్, పీహెచ్సీ, వెటర్నరీ ఆసుపత్రి, ఫైర్ స్టేషన్ల ను కలెక్టర్తనిఖీ చేశారు. విద్యార్థులు, టీచర్ల హాజరును పరిశీలించారు. పాఠశాలలో సదుపాయాల కొరత ఉంటే ప్రతిపాదనలు పంపాలన్నారు.
పీహెచ్సీలో నార్మల్ డెలివరీలు చేయాలని, సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. నేడు చేపట్టే ఇందిరమ్మ ఇండ్ల మార్కింగ్ మహామేళాలో లబ్ధిదారులు పనులు ప్రారంభించేలా చూడాలని ఎంపీడీవోకు సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సంతోష్, ఎంపీడీవో శ్రీనివాసరావు, హెచ్ఎం మంజూల, డాక్టర్ప్రవీణ్ ఉన్నారు.