టాక్స్ కట్టకుంటే ఆస్తులు జప్తు : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి

టాక్స్ కట్టకుంటే ఆస్తులు జప్తు : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి
  • కలెక్టర్ వినయ్​కృష్ణారెడ్డి 

నిజామాబాద్, వెలుగు : నగర పాలక సంస్థ పరిధిలో అన్ని రకాల పన్నులు వసూలు చేయాలని, ఎవరిపై మెహర్బానీ చూపించొద్దని కలెక్టర్ వినయ్​ కృష్ణారెడ్డి సూచించారు. శుక్రవారం నగర పాలక స్పెషల్ ఆఫీసర్ హోదాలో కలెక్టరేట్​లో రివ్యూ నిర్వహించి మాట్లాడారు. ట్యాక్స్​లు పెండింగ్​ పెట్టిన వారిని గుర్తించి నోటీసులు జారీ చేయాలని, స్పందించకుంటే ఆస్తులు జప్తు చేయాలన్నారు. అక్రమ నల్లా కనెక్షన్లు గుర్తించి క్రమబద్ధీకరించాలని నగర పాలక కమిషనర్ దిలీప్​కుమార్​ను ఆదేశించారు. ​

పర్మిషన్​లేని నిర్మాణాలను ఆపాలని, శానిటేషన్, వాటర్ సప్లై లోపాలుంటే సరిచేసుకోవాలని, ఎలాంటి ఫిర్యాదు రావద్దన్నారు.  వంద రోజుల ప్లాన్​తో పని చేసి ఫలితాలు చూపాలని సూచించారు. ఎల్ఆర్ఎస్​ ఫీజు కట్టిన ఇంటి ప్లాట్​ ఓనర్​కు ప్రొసీడింగ్స్ అందించాలన్నారు. డిప్యూటీ కమిషనర్ రవిబాబు తదితరులు ఉన్నారు. అంతకు ముందు కలెక్టర్​ రైతు బజార్, బస్తీ దవాఖాన, అమృత్ స్కీమ్​లను 
పరిశీలించారు. ఈవీఎం గోదామ్ చెక్ చేశారు.