
నిజామాబాద్, వెలుగు: అమృత్ 2.0 స్కీమ్ కింద నగరానికి మంజూరైన వాటర్ ట్యాంకు పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన నగర పాలక పరిధిలోని ఖానాపూర్, కాలూర్ విలీన గ్రామాలను కమిషనర్ దిలీప్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. ట్యాంకుల పక్కనే ఉన్న సర్కార్ స్కూల్‌ను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దుబ్బ ఏరియాలో అండర్ గ్రౌండ్ పైప్‌లైన్ పనులు ఆలస్యం కావడంపై కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గంజ్ ప్రాంతంలో ఆక్రమణలు తొలగించాలని, నాగారం గృహకల్ప ఇండ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అలాట్ చేయాలని ఆర్అండ్బీ ఇంజినీర్లను ఆదేశించారు. తడిపొడి చెత్తను వేరుగా సేకరించాలన్నారు. ఖానాపూర్ పీహెచ్సీ, మోపాల్‌లోని సింగిల్ విండో గోదామ్ సందర్శించి యూరియా స్టాక్ వివరాలను తెలుసుకున్నారు.