15 రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం : కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

15 రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం : కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

నిజామాబాద్, వెలుగు: దరఖాస్తు చేసుకున్న అర్హులకు 15 రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని కలెక్టర్ వినయ్​ కృష్ణారెడ్డి తెలిపారు.  మంగళవారం ఆయా శాఖల ఆఫీసర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ఇండ్ల లబ్ధిదారుల పేర్లను రెండు రోజుల్లో ప్రధాన మంత్రి గ్రామీణ్ పోర్టల్​లో నమోదు చేయాలన్నారు. ఎల్ఆర్ఎస్​ ఫీజు తీసుకుని ప్రొసీడింగ్స్ అందజేయాలన్నారు. అదనపు కలెక్టర్ అంకిత్, డీఆర్డీవో సాయాగౌడ్, నగర పాలక కమిషనర్ దిలీప్​కుమార్ ఉన్నారు.  

పట్టాదారు పాస్​పుస్తకం తీసుకోకుండా రైతులకు పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించారు. మహాలక్ష్మీ స్కీమ్​ కింద మహిళలు రూ.239.17 కోట్ల విలువ ఫ్రీ జర్నీ చేశారని తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం సంబురాలు నిర్వహించనున్నామన్నారు. వర్షాలతో ఇబ్బంది వస్తే 08462–220183కి ఫోన్​ చేయాలన్నారు.  మోపాల్​ మండలం కంజర జ్యోతిబాపూలే పాఠశాలను కలెక్టర్​ విజిట్​ చేసి స్టూడెంట్స్​తో మాట్లాడారు.