
నిజామాబాద్, వెలుగు : సర్కార్ ఆస్పత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. శనివారం ఆయన డిచ్పల్లి మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను విజిట్ చేసి మాట్లాడారు. ప్రభుత్వ దవాఖానలకు ఎక్కువ శాతం పేదలే వస్తారన్నారు. సాధ్యమైనంత వరకు నార్మల్ డెలివరీలు చేయాలన్నారు.
ప్రతి రోజు సీహెచ్‌సీ, పీహెచ్‌సీల పనితీరు పర్యవేక్షించాలని డీఎంహెచ్‌వో రాజశ్రీని ఆదేశించారు. ప్రతి నెలా రెండో శనివారం నిర్వహించే ఆరోగ్యశ్రీ క్యాంప్‌లకు అన్ని విభాగాల డాక్టర్లు హాజరయ్యేలా చూడాలన్నారు. కమ్యూనిటీ సెంటర్లలోని స్టాఫ్ హాజరును పరిశీలించారు. ఓపీ చెక్ చేసి, ల్యాబ్, ఇన్‌పేషెంట్ వార్డులు తనిఖీ చేశారు. తరువాత తహసీల్దార్ ఆఫీస్‌కు వెళ్లి భూభారతి అప్లికేషన్లను పరిశీలించారు. భూభారతి అప్లికేషన్లపై తహసీల్దార్ సతీష్‌రెడ్డికి సూచనలు ఇచ్చారు.