
నిజామాబాద్, వెలుగు : జిల్లాలో యూరియా కొరతలేదని, సరిపడా యూరియా నిల్వ ఉందని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం మాక్లూర్ మండలం అమ్రాద్ విలేజ్‌లోని సింగిల్ విండో గోదాంలోని యారియా స్టాక్‌ను పరిశీలించి మాట్లాడారు. యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తహసీల్దార్ ఆఫీస్‌కు వెళ్లి భూభారతి అప్లికేషన్ల ఆన్లైన్ తీరును పరిశీలించారు. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు, వాటి విచారణ రిపోర్టును చూసి తహసీల్దార్ శేఖర్‌కు సూచనలు చేశారు.
సీజనల్ వ్యాధులపై అలర్ట్‌గా ఉండాలని ఎంపీడీవో నర్సింహారెడ్డికి సూచించారు. దోమల నివారణకు ఫాగింగ్ షురూ చేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై దృష్టికి పెట్టాలన్నారు. అమ్రాద్ తండాలో కెనాల్ కట్టపై గతేడాది నాటిన మొక్కలను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు.
సర్కార్ హాస్పిటల్స్‌లోనే కాన్పులు జరగాలి
సర్కార్ హాస్పిటల్స్‌లో ఆపరేషన్లు లేకుండా నార్మల్ డెలివరీలు చేయాలని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి సూచించారు. గతంతో పోలిస్తే గవర్నమెంట్ దవాఖానాల్లో ఆపరేషన్ల సంఖ్య ఎందుకు పెరిగాయో తెలుపాలన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో మెడికల్ ఆఫీసర్లతో మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. నార్మల్ డెలీవరీల కోసం ప్రయత్నం చేయాలన్నారు. నిపుణులైన డాక్టర్లు, సిబ్బంది ఉన్న సర్కార్ హాస్పిటల్స్‌లో అశ్రద్ధ చేయొద్దన్నారు. డీఎంహెచ్‌వో డాక్టర్ రాజశ్రీ తదితరులు ఉన్నారు.