51 లక్షల మొక్కలు నాటాలి : వినయ్ కృష్ణారెడ్డి

 51 లక్షల మొక్కలు నాటాలి : వినయ్ కృష్ణారెడ్డి
  •  కలెక్టర్ వినయ్ ​కృష్ణారెడ్డి

నిజామాబాద్​, వెలుగు: వర్షాలు కురుస్తున్నందున వనమహోత్సవంలో భాగంగా జిల్లాలో 51 లక్షల మొక్కలు నాటాలని కలెక్టర్ వినయ్​కృష్ణారెడ్డి సూచించారు.  గురువారం కలెక్టరేట్​లో ఆయా శాఖల ఆఫీసర్లతో మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. భారీ వర్షాల దృష్ట్యా యంత్రాంగం అలర్ట్​గా ఉండాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక కొరత రానీయొద్దన్నారు. ఆయిల్​పామ్ సాగు లక్ష్యం 3500 ఎకరాలు కాగా, 1,242 ఎకరాల్లో సాగు చేయడానికి రైతులు ఒప్పుకున్నందున పనుల్లో వేగం పెంచాలన్నారు. 

సీజనల్ వ్యాధులు, టీబీ ముక్త్​భారత్​ పై ఫోకస్ పెట్టాలన్నారు. నిర్మాణ దశలో ఉన్న అంగన్​వాడీ, పీహెచ్​సీ, సబ్ సెంటర్​ పనులు పూర్తి చేయాలని ఇంజినీర్లను ఆదేశించారు. అదనపు కలెక్టర్ అంకిత్, కిరణ్​కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్, నగర పాలక కమిషనర్ దిలీప్​కుమార్ తదితరులు పాల్గొన్నారు.