డ్రాపౌట్ స్కూల్స్పై ఫోకస్ పెట్టాలి : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి

డ్రాపౌట్ స్కూల్స్పై ఫోకస్ పెట్టాలి : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి

నిజామాబాద్, వెలుగు : సర్కార్ స్కూల్స్​ వీడుతున్న డ్రాపౌట్ విద్యార్థులపై  దృష్టి సారించి తిరిగి చేరేలా చొరవ చూపాలని కలెక్టర్ వినయ్​కృష్ణారెడ్డి కోరారు. సోమవారం ఆయన జిల్లాలోని ఎంఈవోలతో కలెక్టరేట్​లో మీటింగ్​ నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుపడ్డాయని, టీచర్ల కొరత తీరిందని, నాణ్యమైన బోధన, ఫ్రీ యూనిఫారాలు,  టెక్ట్స్​​ బుక్స్​, నోట్ బుక్స్​, ఎండీఎం విషయాలపై పేరెంట్స్​కు తెలిసేలా ప్రచారం చేయాలన్నారు. బడిబాటతో అడ్మిషన్​లు పెరిగాయన్నారు. 

టెన్త్​ ముగించాక పై చదువులకు వెళ్లని స్టూడెంట్స్​ వివరాలు సేకరించాలన్నారు. కిచెన్ షెడ్స్​ అవసరమున్న బడుల వివరాలు అందజేయాలన్నారు. అదనపు కలెక్టర్ అంకిత్​, ట్రైనీ కలెక్టర్   కరోలిన్​, డీఈవో అశోక్​ తదితరులు ఉన్నారు. మోపాల్​ మండలం కంజర్​ విలేజ్​లోని జడ్పీ హైస్కూల్​ను కలెక్టర్ విజిట్​ చేశారు.  రూ.11.20 లక్షలతో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ తాగునీరు, కరెంట్​ వసతి కల్పించి రిపేర్లు పూర్తి చేశారని హెచ్​ఎం గోపాలచారి తెలిపారు.