స్కానింగ్ సెంటర్లపై నిరంతర నిఘా : డాక్టర్ రాజశ్రీ

స్కానింగ్ సెంటర్లపై నిరంతర నిఘా : డాక్టర్ రాజశ్రీ
  • డీఎంహెచ్​వో డాక్టర్ రాజశ్రీ

నిజామాబాద్​, వెలుగు: జిల్లాలోని స్కానింగ్ సెంటర్లలో రూల్స్​కు విరుద్ధంగా లింగ నిర్థారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్​వో డాక్టర్ రాజశ్రీ తెలిపారు. ఇందుకోసం నియమించిన కమిటీ నిరంతరం నిఘా కొనసాగిస్తుందన్నారు. 

సోమవారం ఆమె తన ఆఫీస్​లో మీటింగ్​ నిర్వహించి మాట్లాడారు.  కొత్తగా జిల్లాలో రెండు స్కానింగ్ సెంటర్ల అనుమతి, నిబంధనలు పాటించని రెండు కేంద్రాలు మూసివేతకు ఆదేశాలు జారీ చేస్తున్నామన్నారు. డాక్టర్​ శ్వేత, డాక్టర్ ఇందు, డాక్టర్ సుప్రియ, డాక్టర్ తుకారామ్​ రాథోడ్ పాల్గొన్నారు.