నిజామాబాద్ జిల్లాలో పెండింగ్ పనులపై ఫోకస్ పెట్టాలి : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి

నిజామాబాద్ జిల్లాలో పెండింగ్ పనులపై ఫోకస్ పెట్టాలి : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి

నిజామాబాద్, వెలుగు : మండల అధికారులతో పాటు స్పెషల్ ఆఫీసర్లు పెండింగ్​ పనులపై ఫోకస్ పెట్టాలని కలెక్టర్​ వినయ్ ​కృష్ణారెడ్డి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్​లో అధికారులతో నిర్వహించిన మీటింగ్​లో ఆయన మాట్లాడారు. లోకల్​బాడీ, రెసిడెన్షియల్ స్కూల్స్​, హాస్టల్స్​, అంగన్​వాడీ, హాస్పిటల్​ పనులు యుద్ధ ప్రాతిపదికన ముగిసేలా చొరవ చూపాలన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో ఇంకా ఏమైనా అవసరాలుంటే కమిటీలు ప్రతిపాదనలు పంపేలా చూడాలన్నారు. 

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్ల పంపిణీకి లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని​, సీజనల్​ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యూరియా నిల్వల సమాచారం రైతులకు తెలిసేలా షాప్​ల ఎదుట బోర్డులు పెట్టించాలన్నారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్​కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్  దిలీప్​కుమార్ పాల్గొన్నారు. 

నవీపేట్​లో కలెక్టర్ ​ఆకస్మిక తనిఖీలు

నవీపేట్, వెలుగు  : మండల కేంద్రంలో శుక్రవారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గవర్నమెంట్ హాస్పిటల్, స్కూల్స్, అంగన్​వాడీ కేంద్రం, తహసీల్దార్ కార్యాలయం తనిఖీ చేశారు.  గవర్నమెంట్ హాస్పిటల్​లో వైద్య సేవలపై ఆరా తీశారు.  ధర్యాపూర్ గవర్నమెంట్ స్కూల్ మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అంగన్​వాడీ కేంద్రాల్లో బాలింతలు, గర్భిణులకు అందాల్సిన పౌష్టికాహారం పై ఆరా తీశారు. వెటర్నరీ హాస్పిటల్, తహసీల్దార్ కార్యాలయం తనిఖీ చేశారు. ‘భూభారతి’ అప్లికేషన్లు త్వరగా 
పరిష్కరించాలన్నారు.