ప్రజలకు మానవత దృక్పథంతో సేవలు అందించాలి : జీవన్ పాటిల్

ప్రజలకు మానవత దృక్పథంతో సేవలు అందించాలి : జీవన్ పాటిల్

సిద్దిపేట రూరల్, వెలుగు : ప్రజలకు మానవత దృక్పథంతో సేవలు అందించాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ డాక్టర్లకు, సిబ్బందికి సూచించారు. బుధవారం సిద్దిపేట పట్టణంలోని ఎన్సాన్ పల్లి గ్రామ శివారులో ఇటివలే ప్రారంభమైన 1000 పడకల హాస్పిటల్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.  రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. హాస్పిటల్ లో జనరల్ వైద్యం, విద్యార్థుల డెమో గది, డివిఎల్ కన్సల్టెన్సీ, ఓసీడీ నేత్ర, దంత వైద్యం, నమూనా సేకరణ గదులు, పార్మసీ సెంటర్, హెల్ప్ డెస్క్ లను ఆయన పరిశీలించారు.

ప్రతి రోగికి సులభంగా తెలిసేవిధంగా హెల్ప్ డెస్క్ సిబ్బంది పని చేయాలని, హాస్పిటల్ లో ఒక్క సెకన్​ కూడా కరెంట్ పోకుండా విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ ఎస్ఈ కి తెలిపారు. కలెక్టర్ వెంట మెడికల్ కాలేజ్ డైరెక్టర్ విమలాథామస్, డీఎంఈ రమేశ్​రెడ్డి, డీఎం హెచ్ఓ డాక్టర్​ కాశీనాథ్, టీఎస్ఎంఎస్ఐడీసీ డీఈ విశ్వ ప్రసాద్, ఈఈ శ్రీనివాస్ ఉన్నారు.