పోలింగ్‌‌‌‌‌‌‌‌ పర్సంటేజీపై ఫోకస్​ పెట్టాలి : యాస్మిన్ బాషా

పోలింగ్‌‌‌‌‌‌‌‌ పర్సంటేజీపై ఫోకస్​ పెట్టాలి : యాస్మిన్ బాషా

జగిత్యాల టౌన్, వెలుగు: మే13న జరగనున్న లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో ప్రతి ఓటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓటు హక్కు వినియోగించుకునేలా చూసే బాధ్యత అధికారులపై ఉందని, పోలింగ్‌‌‌‌‌‌‌‌ పర్సంటేజీ పెంపుపై ఫోకస్‌‌‌‌‌‌‌‌ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ యాస్మిన్ బాషా అన్నారు. గురువారం జగిత్యాల కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో అడిషనల్ కలెక్టర్లు దివాకర, రాంబాబు తో మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ఓటింగ్ శాతం పెంచడానికి 'ఓట్ల  పర్వం-–ఓటే సర్వం' అనే నినాదంతో కూడిన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 7,12,710 మంది ఓటర్లున్నారన్నారు. జిల్లాలోని 782 పోలింగ్ కేంద్రాల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని, పోలింగ్‌‌‌‌‌‌‌‌ సరళిపై నిఘాకు 990 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు .

పోస్టల్‌‌‌‌‌‌‌‌ బ్యాలెట్‌‌‌‌‌‌‌‌ను వినియోగించుకోవాలి

కరీంనగర్ టౌన్, వెలుగు: ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని  కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. గురువారం స్థానిక స్కూల్ లో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సెంటర్ ను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా 
ఆమె మాట్లాడుతూ ఏ ఒక్క ఉద్యోగి కూడా మిస్ కాకుండా అందరూ ఓట్లు వేసేలా చూడాలన్నారు. నియోజకవర్గంలో మొత్తం 6,843 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉండగా, ఇప్పటివరకు 5,434 ఓటింగ్‌‌‌‌‌‌‌‌ నమోదైనట్లు చెప్పారు. మిగతా 1,409మంది చివరిరోజు తమ ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో శ్రీనివాస్, ఇండస్ట్రియల్ ఎస్టేట్ జీఎం నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్లలో ఎన్నికల అధికారులకు  ట్రైనింగ్

రాజన్నసిరిసిల్ల,వెలుగు: సెక్టార్ ఆఫీసర్స్, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ బాధ్యులు సమన్వయంతో ఎన్నికల విధులు నిర్వర్తించాలని అడిషనల్ కలెక్టర్ పూజారి గౌతమి  సూచించారు. గురువారం సిరిసిల్ల కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో సెక్టార్ ఆఫీసర్స్, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ బాధ్యులకు పోలింగ్‌‌‌‌‌‌‌‌ బాధ్యతలపై ట్రైనింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందరూ కలిసి టీమ్ వర్క్‌‌‌‌‌‌‌‌తో ఎన్నికలు నిర్వహించాలన్నారు. సిరిసిల్ల ఏఆర్ఓలో మొత్తం 30 సెక్టార్లు ఏర్పాటు చేశామని, రిజర్వ్ సిబ్బంది  ఉంటారని తెలిపారు. 12న మధ్యాహ్నంలోగా ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 13న రిసెప్షన్ సెంటర్ల వద్ద తగిన ఏర్పాట్లు చేశామని వివరించారు. కార్యక్రమంలో ఆర్డీవో రమేష్, మాస్టర్ ట్రైనర్ మహేందర్ రెడ్డి  పాల్గొన్నారు.