ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ స్పీడప్ చేయాలి : వరంగల్ భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్లు

ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ స్పీడప్ చేయాలి : వరంగల్ భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్లు

గ్రేటర్​ వరంగల్/ జూలూరుపాడు, వెలుగు: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని వరంగల్, భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్లు సత్యశారద, అంకిత్​ అన్నారు. శుక్రవారం వరంగల్​ కలెక్టరేట్​లో కలెక్టర్​ అడిషనల్​ కలెక్టర్​ సంధ్యతో కలిసి రైస్​మిల్లర్లు, కాంట్రాక్టర్లు, సంబంధిత ఆఫీసర్లతో సమావేశం నిర్వహించి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మిల్లర్లు ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని ఆదేశించారు. అనంతరం కొనుగోలు సెంటర్​ను సందర్శించారు. 

ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా వరంగల్ మండలం పైడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బలమైన బాల్యానికి వెయ్యి మెట్లు కార్యక్రమానికి కలెక్టర్ హాజరై పలు సూచనలు చేశారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్​ అంకిత్​ పరిశీలించారు. గురువారం రాత్రి కురిసిన అకాల వర్షాలకు మక్కలు తడవడంతో ఆయన కేంద్రాన్ని సందర్శించి వివరాలు ఆరా తీశారు.