ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

భైంసా, వెలుగు:  అర్హులైన పేదలందరికీ డబుల్​బెడ్​ రూం ఇండ్లు శాంక్షన్​చేస్తామని కలెక్టర్​ ముషారఫ్​అలీ ఫారుఖీ చెప్పారు. ఇటీవల భైంసాలో 686 ‘డబుల్’  ఇండ్లకు దరఖాస్తులు ఆహ్వానించగా.. వేల సంఖ్యలో అప్లై చేసుకున్నారు. ప్రస్తుతం భైంసా పట్టణంలో అప్లికేషన్ల వెరిఫికేషన్​ కొనసాగుతుండగా.. మంగళవారం కలెక్టర్​ ముషారఫ్​అలీ ఆ ప్రక్రియను పరిశీలించారు. bha6వ వార్డుకు వెళ్లి దరఖాస్తుదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధి దారుల ఎంపిక పారదర్శకంగా చేపడుతామన్నారు. పేదలు ఎవ్వరికీ నయా పైసా ఇవ్వొద్దన్నారు. ఎవరైనా పైసలడిగితే తనకు కంప్లైంట్​చేయాలన్నారు.  

బాసర ట్రీపుల్​ ఐటీలో పర్యటన

బాసర ఆర్జీయూకేటీ క్యాంపస్​లో మంగళవారం కలెక్టర్ పర్యటించారు. ఇటీవల మంత్రి కేటీఆర్​ పర్యటనకు వచ్చిన సందర్భంగా మెస్​ టెండర్ల  నిర్వహణపై సీరియస్​ అయ్యారు. అందులో భాగంగా కొత్తగా ఏర్పాటు చేస్తున్న మెస్​లను పరిశీలించారు. స్టూడెంట్లకు క్వాలిటీ ఫుడ్​అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఆర్డీవో కేవీవీ రవికుమార్​, తహసీల్దార్​ చంద్రశేఖర్​రెడ్డి ఉన్నారు. 

ఎన్నికల హామీలు ఎన్ని నెరవేర్చినవ్?: బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్​

మంచిర్యాల, వెలుగు:  ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారో ఎమ్మెల్యే దివాకర్​రావు చెప్పాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్​ వెరబెల్లి  ప్రశ్నించారు.  మంగళవారం బీజేపీ జిల్లా ఆఫీస్​లో ప్రెస్​మీట్​లో ఆయన మాట్లాడుతూ..  నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దివాకర్​రావు నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. మంచిర్యాల –-అంతర్గాంలపై గోదావరి బ్రిడ్జి నిర్మిస్తామని జీవోల పేరుతో మభ్యపెడుతున్నారని, లక్ష్మీ టాకీస్​ నుంచి రాజీవ్ నగర్ రైల్వే బ్రిడ్జి కట్టిస్తానని హామీ ఇచ్చి ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. బీజేపీ పోరాటంతో జిల్లాకు శాంక్షన్​అయిన మెడికల్ కాలేజీ కి ఇప్పటి వరకు భూమిని కేటాయించలేదన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే బీజేపీ తరఫున ఉద్యమిస్తామని హెచ్చరించారు. బీజేపీ లీడర్లు వెంకటేశ్వర్ రావు, పురుషోత్తం,  ఆంజనేయులు, శ్రీదేవి, మల్లేశ్​, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: కోట్నాక్ విజయ్ కుమార్​

ఆసిఫాబాద్, (కెరమెరి), వెలుగు : తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి  కోట్నాక్​విజయ్ కుమార్ అన్నారు. మంగళవారం కెరమెరి లో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం  జరిగింది. హాజరైన విజయ్​కుమార్​మాట్లాడుతూ బీజేపీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు సైనికులుగా పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్రమోడీని ఆదర్శంగా తీసుకుని పార్టీకి అంకితమై పనిచేయాలన్నారు. మండల  ఇన్​చార్జి కుందారపు బాలకృష్ణ, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్ కుమార్,  మండల కార్యదర్శి రంగు శ్రీకాంత్, చందు నాయక్ పాల్గొన్నారు. 

గేమ్స్ తో ఫిజికల్ ఫిట్నెస్

ఆటలాడడం వల్ల ఫిజికల్ ఫిట్నెస్​పెరుగుతుందని అథ్లెటిక్స్ జిల్లా అధ్యక్షుడు కోట్నాక్​విజయ్ కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని గురుకుల స్కూల్ ఆవరణలో  జిల్లా స్థాయి అథ్లెటిక్స్ క్రాస్ కంట్రీ పోటీలను ఆయన ప్రారంభించారు. 

అయ్యప్ప పడిపూజకు వివేక్​ విరాళం

అయ్యప్పలకు అందజేసినస్థానిక బీజేపీ లీడర్లు

రామకృష్ణాపూర్, వెలుగు:  క్యాతనపల్లి మున్సిపాలిటీలోని రామకృష్ణాపూర్​కోదండరామాలయంలో ఈ నెల18న నిర్వహించే అయ్యప్ప పడి పూజ, మహా అన్నదాన కార్యక్రమానికి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్​వెంకటస్వామి, పార్టీ  జనరల్​ సెక్రటరీ అందుగుల శ్రీనివాస్ రూ.50వేల విరాళం ప్రకటించారు. ఇటీవల అయ్యప్ప స్వాములు, స్థానిక లీడర్లతో కలిసి వెళ్లి వివేక్​ వెంకటస్వామిని పడిపూజలో పాల్గొనాలని ఆహ్వానించారు.  మంగళవారం రామకృష్ణాపూర్​లోని పార్టీ ఆఫీస్​లో అయ్యప్ప స్వాములకు అందుగుల శ్రీనివాస్​, బీజేపీ టౌన్​ ప్రెసిడెంట్​మహంకాళీ శ్రీనివాస్  విరాళం అందించారు. సీనియర్​ నాయకుడు పోశం, మున్సిపల్​ఇన్​చార్జి  తిరుపతి, నియోజకవర్గ కన్వీనర్​రమేశ్​, టౌన్​ జనరల్​ సెక్రటరీలు మాస్​ సత్యనారాయణ, వేల్పుల సత్యనారాయణ, వైస్​ ప్రెసిడెంట్లు   రవి,  మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. 

‘మనబడి’ పనులు వేగంగా పూర్తి చేయాలి: కలెక్టర్​ సిక్తా పట్నాయక్​

ఆదిలాబాద్​టౌన్/గుడి హత్నూర్, వెలుగు: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ‘మన ఊరు –మన బడి’ కింద చేపట్టిన అభివృద్ధి పనులను  వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్​సిక్తాపట్నాయక్​ఆదేశించారు. మంగళవారం ఆదిలాబాద్​ గ్రామీణ మండలం చాందా‘టి’, గుడిహత్నూర్​ మండలం కొల్హారి, మన్నూర్​ గ్రామాల్లోని స్కూళ్లను విజిట్​చేశారు. స్టూడెంట్లతో మాట్లాడి, అభివృద్ధి పనులు పరిశీలించారు. అనంతరం ఆయా గ్రామాల్లోని రేషన్​షాప్​లను పరిశీలించారు. అభివృద్ధి పనులను స్కూల్​ మేనేజ్ మెంట్ కమిటీలు, సర్పంచ్​లు, స్కూల్​టీచర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. సెక్టోరల్ ఆఫీసర్​నారాయణ, ఆయా మండల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు. 

స్టూడెంట్లు ఇన్నోవేషన్లపై ఫోకస్​పెట్టాలి: కలెక్టర్​ భారతీ హోళికేరి

మంచిర్యాల, వెలుగు: ప్రస్తుత కంప్యూటర్​ కాలంలో   ఇన్నోవేషన్​పై  ఫోకస్​ పెట్టాలని,   మానవాళికి ఉపయోగపడే ఆవిష్కరణలు చేయాలని కలెక్టర్​ భారతీ హోళీకేరి సూచించారు. సోమవారం రాత్రి జరిగిన ‘ఇంటింటా ఇన్నోవేషన్​ చాలెంజ్’​  ప్రోగ్రాంలో భాగంగా ఎస్​ఐసీ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  కొత్త  ఆలోచనలకు ఇంటింటా ఇన్నోవేషన్​ ఒక మంచి వేదిక కావాలన్నారు. భావి ఆవిష్కర్తలుగా మారేందుకు కాలేజ్, స్కూల్ ​స్టూడెంట్లు కృషి చేయాలన్నారు. అడిషనల్​ కలెక్టర్​ రాహుల్, ట్రైనీ కలెక్టర్​ గౌతమి, డీఈవో వెంకటేశ్వర్లు, సైన్స్​ ఆఫీసర్​ ఉన్నారు.