అకడమిక్ నాలెడ్జ్‌ కంటే అనుభవానికే పవర్ ఎక్కువ

అకడమిక్ నాలెడ్జ్‌ కంటే అనుభవానికే పవర్ ఎక్కువ

మన రాజ్యసభలో చాలా అనుభవజ్ఞులైన సభ్యులు ఉన్నారని, మంచి చట్టాలు చేయడంలో వారి అనుభవం ఎల్లప్పుడూ ఉపయోగపడాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కొన్నిసార్లు అకడమిక్ నాలెడ్జ్ కంటే అనుభవానికే ఎక్కువ శక్తి ఉంటుందని ఆయన అన్నారు. ఈ రోజు రిటైర్ అవుతున్న రాజ్యసభ ఎంపీలు మళ్లీ తిరిగి సభకు ఎన్నికవ్వాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. రాజ్యసభలో ఇవాళ 72 మంది ఎంపీల పదవీకాలం ముగుస్తోంది. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు, డిప్యూటీ చైర్మన్ హరివంశ్.. రిటైర్ అవుతున్న సభ్యులకు వీడ్కోలు చెప్పారు. ఈ సందర్భంగా వారితో కలిసి ఫొటో దిగారు. అనంతరం సభ మొదలయ్యాక ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యసభలో మాట్లాడుతూ ఇవాళ రిటైర్ అవుతున్న వారిలో పలువురు సభ్యులు సుదీర్ఘ కాలం పార్లమెంట్‌లో ఉన్నారన్నారు. కొన్నిసార్లు అకడమిక్ నాలెడ్జ్‌ కంటే అనుభవమే చాలా శక్తిమంతమైనదని అన్నారు. ఈ దేశ ప్రజలకు మంచి చేసే చట్టాలు తీసుకురావడంలో లోక్‌సభ కంటే రాజ్యసభ పాత్రనే ఎక్కువని చెప్పారు. రాజ్యసభలో సభ్యులుగా పొందిన అనుభవాన్ని దేశ నలుమూలలకూ ఉపయోగపడేలా చూడాలన్నారు.

మరిన్ని వార్తల కోసం..

యాదాద్రి ప్రధానాలయంలో ఇంకా మొదలవ్వని పూజలు

పెట్రో ధరల పెంపు.. మోడీ పాత ట్వీట్లను షేర్ చేసిన కేటీఆర్

రేప్ కేసు నిందితుడి ఇల్లు కూల్చివేత