
న్యూయార్క్: ఉక్రెయిన్ లో ఉంటున్న అమెరికా పౌరులను వెనక్కి వచ్చేయాలన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఉక్రెయిన్ను తక్షణమే వీడాలని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రపంచంలోనే అతి పెద్ద సైన్యాల్లో రష్యా ఒకటని, ఏ క్షణమైనా పరిస్థితులు మారిపోవచ్చనని, అందుకే అమెరికా పౌరులు వెంటనే తిరిగి వచ్చేయాలన్నారు బైడెన్. రెండ్రోజుల క్రితమే రష్యాపై అమెరికా వ్యాఖ్యలు చేసింది. రష్యా దాడుల్ని సమర్థంగా తిప్పికొడతామని, అవసరమైతే అన్ని రకాల ఒప్పందాలను రద్దు చేసుకుంటామని ప్రకటించింది. ఈ ప్రకటన వచ్చిన కొన్ని గంటల్లోనే.. అమెరికా రష్యా విషయంలో వెనక్కి తగ్గింది. మరోవైపు భారత్ సహా పలు దేశాలు ఉక్రెయిన్లో ఉంటున్న తమ పౌరుల కోసం జాగ్రత్తలు చెప్తున్నాయి. సరిహద్దుల్లో చదువుతున్న విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాయి.