కేంద్ర మంత్రులకూ ఇన్విటేషన్
అన్ని రాష్ట్రాల సీఎంలు హాజరయ్యేలా ప్రణాళికలు
ఒక్కో రాష్ట్రానికి వెళ్లి ఆహ్వానించనున్న మంత్రులు
హైదరాబాద్/న్యూఢిల్లీ, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం (డిసెంబర్ 4) ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్‌తో భేటీ కానున్నారు. తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమిట్కు అటెండ్ కావాల్సిందిగా ఆహ్వానించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రధానితో భేటీ అయ్యే అవకాశం ఉన్నది. డిసెంబర్ 8, 9వ తేదీల్లో నిర్వహించనున్న రైజింగ్ వేడుకల్లో పాలుపంచుకోవల్సిందిగా కేంద్ర మంత్రులనూ కోరనున్నారు.
మంగళవారం రాత్రి రేవంత్, భట్టి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి ఢిల్లీకి చేరుకున్నారు. తర్వాత నేరుగా ఖర్గే నివాసానికి వెళ్లారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్–2025కు హాజరు కావాలని ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఇన్విటేషన్‌ను డిప్యూటీ సీఎంతో కలిసి రేవంత్ అందజేశారు. అనంతరం గ్లోబల్ సమిట్కు సంబంధించిన వివరాలను ఖర్గేకు సీఎం స్వయంగా వివరించారు. కాగా, అన్ని రాష్ట్రాల సీఎంలనూ ప్రత్యేకంగా ఆహ్వానించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు.
మంత్రులే స్వయంగా వెళ్లి సీఎంలను కలిసి ఈ సదస్సుకు ఆహ్వానిస్తారు. ఎవరెవరు ఏ.. ఏ రాష్ట్రాలకు వెళ్లాలో సీఎం నిర్ణయించారు. 4న మంత్రులు ఆయా రాష్ట్రాలకు వెళ్లి గ్లోబల్ సమిట్ ఇన్విటేషన్ లెటర్లు అందజేస్తారు. జమ్మూ కశ్మీర్, గుజరాత్‌కు ఉత్తమ్, పంజాబ్, హర్యానాకు దామోదర రాజనర్సింహ, ఏపీకి వెంకట్ రెడ్డి, కర్నాటక, తమిళనాడుకు శ్రీధర్ బాబు, యూపీకి పొంగులేటి, రాజస్థాన్ కు పొన్నం, చత్తీస్‌గఢ్‌కు కొండా సురేఖ, వెస్ట్ బెంగాల్ కు సీతక్క, మధ్యప్రదేశ్ కు తుమ్మల, అస్సాంకు జూపల్లి కృష్ణా రావు, బిహార్‌కు వివేక్, ఒడిశాకు వాకిటి శ్రీహరి, హిమాచల్ ప్రదేశ్ కు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహారాష్ట్రకు అజారుద్దీన్ వెళ్లి సీఎంలను కలిసి ఆహ్వానిస్తారు. ఢిల్లీ సీఎం, కేంద్ర మంత్రులను ఎంపీలు కలిసి
ఇన్విటేషన్ అందజేస్తారు.
