
కమెడియన్ ప్రవీణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘బకాసుర రెస్టారెంట్’.వైవా హర్ష టైటిల్ రోల్‌లో నటిస్తున్నాడు. కృష్ణభగవాన్ ,షైనింగ్ ఫణి, కేజీఎఫ్ గరుడరామ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌జే శివ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రాన్ని లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి నిర్మిస్తున్నారు.
ఆగస్టు 8న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు గురువారం ప్రకటించారు. తెలుగు సినీ ప్రియులకు ‘బకాసుర రెస్టారెంట్’ పేరుతో ఓ విందుభోజనం రెడీ అవుతోందని మూవీ టీమ్ తెలియజేసింది.
హంగర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలు, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం తప్పకుండా అందర్నీ అలరిస్తుందనే నమ్మకం ఉందని దర్శక నిర్మాతలు చెప్పారు.