
టాలీవుడ్ టాప్ కమోడియన్ వేణుమాధవ్ (40) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కాలేయ సంబంధ వ్యాధితో సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. వేణుమాధవ్ డిఫరెంట్ కామోడీ టైమింగ్ తో ఆకట్టుకునే వారు. 1996 లో ఎస్వీకృష్ణారెడ్డి డైరెక్షన్ లో వచ్చిన సాంప్రదాయం చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు. 400 లకు పైగా సినిమాల్లో వేణుమాదవ్ నటించారు. సూర్యపేట జిల్లా కోదాడ జన్మించారు. వేణుమాధవ్ కు భార్య శ్రీవాణి , ఇద్దరు పిల్లలు ఉన్నారు. తొలిప్రేమ, ఛత్రపతి,లక్ష్మీ,హంగామా, భూకైలాస్, ప్రేమాభిషేకం, సై, దిల్ , సాంబా , సింహాద్రి వంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు వేణుమాధవ్. లక్ష్మీ సినిమాకు 2006 లో ఉత్తమ హస్యనటుడిగా నంది అవార్డ్ వచ్చింది. చాలా సార్లు టీడీపీ తరపున ఎన్నికల్లో ప్రచారం చేశారు. గత శాసనసభ ఎన్నికల్లో నంద్యాలలో టీడీపీ తరపున ప్రచారం చేశారు వేణుమాధవ్.