వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఉండొచ్చు..కోదండరాం

వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఉండొచ్చు..కోదండరాం

లింగంపేట, వెలుగు : కేసీఆర్​ పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేసేందుకు వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఉండొచ్చని టీజేఎస్ స్టేట్ ​ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి మాత్రం టీజేఎస్సే బరిలో ఉంటుందని స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలో బుధవారం పార్టీ ఆఫీస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సొంత ఆస్తులపై పెట్టిన దృష్టి నియోజకవర్గ అభివృద్ధిపై పెట్టకపోవటం సిగ్గుచేటన్నారు. 

అందరూ కొట్లాడితే ఏర్పడిన తెలంగాణ ఇప్పుడు ఒక్క ఫ్యామిలీకే పరిమితమైందన్నారు. రాష్ట్రంలో 2.70 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కొన్నింటికే నోటిఫికేషన్ ఇవ్వడం సరైంది కాదన్నారు. ధరణి పోర్టల్ ద్వారా పేదలకు భూములు లేకుండా చేస్తోందని విమర్శించారు. ప్రజల కేంద్రంగా రాజకీయాలు సాగాలన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి టీజేఎస్ తరఫున నిజ్జన రమేశ్ బరిలో ఉంటారని ప్రకటించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడిగా కుంబాల లక్ష్మణ్ యాదవ్​, జనరల్ సెక్రటరీగా రజనీకాంత్, వైస్ ప్రెసిడెంట్ గా పూల్​సింగ్, యూత్​ప్రెసిడెంట్గా చాకలి కుమార్, మహిళ విభాగం కన్వీనర్ గా పంబాల రాణిని ప్రకటించారు.