మాస్క్ పెట్టుకోకపోతే సీసీ కెమెరాలతో కూడా గుర్తించి ఫైన్ వేస్తాం

మాస్క్ పెట్టుకోకపోతే సీసీ కెమెరాలతో కూడా గుర్తించి ఫైన్ వేస్తాం

కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్త ఉండాలని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ సూచించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ప్రకారం.. ప్రతి ఒక్కరూ మాస్కు, శానిటైజర్ వాడాలని ఆయన కోరారు. ‘మాస్కులు ధరించని వారిపై కేసు నమోదు చేసి ఈ-చలాన్ ద్వారా రూ.1000 జరిమానా విధిస్తున్నాం. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా కూడా మాస్క్ ధరించని వారిని గుర్తించి కేసులు నమోదు చేసి ఫైన్ వేస్తాం. మంగళవారం మాస్క్ ధరించని 832 మందిపై కేసులు నమోదు చేశాం. రాచకొండ పోలీసులు కూడా కరోనా వైరస్‌పై ప్రధాన కూడళ్లలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కూడా చాలామంది కరోనా వైరస్ బారిన పడుతున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఐదువేల మంది సిబ్బంది వ్యాక్సిన్ తీసుకున్నారు. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ చేసుకునే వారు రెండు వందల మంది కంటే ఎక్కువగా ఉండకూడదు. అక్కడ కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ.. మాస్కులు, శానిటైజర్ తప్పనిసరిగా వాడాలి. ఆస్పత్రుల్లో బెడ్స్ కొరత ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి’ అని ఆయన సూచించారు.