GHMC ఆదాయం పెంచుతం: కమిషనర్ రోనాల్డ్ రాస్

GHMC ఆదాయం పెంచుతం: కమిషనర్ రోనాల్డ్ రాస్

హైదరాబాద్​, వెలుగు :  బల్దియాకు వచ్చే ఆదాయంలో పెద్ద మొత్తంలో ఆదాయ పన్ను ద్వారానే సమకూరుతుందని కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. రోజు రోజుకూ సిటీ పెరుగుతుందని, రెవెన్యూ కూడా పెంచుకునేలా తగిన చర్యలు చేపడుతున్నామని చెప్పారు. నాన్ రెసిడెన్షియల్ కు ఏ విధంగా ట్యాక్స్ ఫిక్స్ చేయాలనేది చట్టంలో ఉందన్నారు. నాన్ రెసిడెన్షియల్ లో చాలా కేటగిరీలు ఉన్నాయని,  జీపీఎస్ మ్యాపింగ్ ద్వారా డోర్ నంబర్ రేషనలైజేషన్ చేసి.. ఆదాయం పెంచేందుకు కృషి చేస్తామన్నారు. ట్యాక్స్ వసూళ్లలో కొన్ని సమస్యలున్నాయని,  సమీక్షలో పరిష్కార మార్గాలను వెతుకుతున్నామన్నారు. రెసిడెంట్స్, నాన్ రెసిడెంట్ పై ట్యాక్స్ రేట్ల మార్పుపై 2017, 2019లో జీవోలు వచ్చాయన్నారు.  ఓయో హోటల్స్, హాస్టళ్లపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. సిటీలో సెల్లర్ లను, పార్కింగ్ పై పోలీస్ శాఖతో కలిసి జాయింట్ సర్వే చేస్తామన్నారు.