యూజర్ల భద్రతకు మేం కట్టుబడి ఉన్నాం

యూజర్ల భద్రతకు మేం కట్టుబడి ఉన్నాం

న్యూఢిల్లీ: యూజర్ల భద్రతకు తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామని ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ స్పష్టం చేసింది. ప్రజల సమాచారాన్ని కాపాడాలన్న కమిట్‌‌మెంట్‌‌ తమకు ఉందని భారత ప్రభుత్వానికి తెలిపామని శుక్రవారం ఓ ప్రకటనలో వాట్సాప్ పేర్కొంది. ‘తప్పుడు ప్రచారాలు, యూజర్ల నుంచి వస్తున్న ఫీడ్‌బ్యాక్‌‌ రివ్యూ తర్వాత మా ప్రైవసీ పాలసీ డేట్‌‌లైన్‌‌ను వాయిదా వేయాలని నిర్ణయించాం. దీన్ని మే 15కు పొడిగిస్తున్నాం. అప్పటిలోపు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతాం’ అని వాట్సాప్ తెలిపింది.