నాణ్యమైన వైద్యానికి కట్టుబడి ఉన్నం.. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని PHC లు సందర్శన

నాణ్యమైన వైద్యానికి కట్టుబడి ఉన్నం.. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని PHC లు సందర్శన
  •    కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

జూబ్లీహిల్స్ , వెలుగు: ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య, వైద్యం అందించేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గురువారం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఖైరతాబాద్, బంజారాహిల్స్ రోడ్ నం.7 ప్రాంతాల్లో ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లను ఆయన సందర్శించారు.

ఆసుపత్రుల్లోని సౌకర్యాలను పరిశీలించి, రోగులకు అందుతున్న సేవలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు సుమారు రూ. 2 కోట్ల విలువైన మెడికల్ ఎక్విప్‌‌మెంట్‌‌ను అందజేసినట్లు తెలిపారు. ఈ ఏడాది రెండోసారి భారీ ఎత్తున వైద్య పరికరాలను పంపిణీ చేశామని వెల్లడించారు.