ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ కోసం రెగ్యులరేషన్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు శుక్రవారం (జూలై 25) ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 9 మందితో ఏర్పాటైన ఈ రెగ్యులరేషన్ కమిటీ చైర్మన్‎గా ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి నియమితులయ్యారు. 

2025 నుంచి 28 మధ్య పారామీటర్స్ పరిగణలోకి తీసుకుని రిపోర్ట్ ఇవ్వాలని కమిటీని ఆదేశించింది ప్రభుత్వం. ఈ కమిటీ అధికారులు, ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో చర్చించి ఫీజుల నియంత్రణకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఈ కమిటీ సిఫారసుల ఆధారంగా ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణపై తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకోనుంది.