
- కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా నేతృత్వంలో నియామకం
- ఈ నెల 23న కమిటీ తొలి భేటీ
న్యూఢిల్లీ, వెలుగు: ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పా టు చేసింది. కమిటీకి కేంద్ర కేబినెట్ సెక్ర టరీ రాజీవ్ గౌబా నేతృత్వం వహించనుండగా.. కేంద్ర హోంశాఖ, న్యాయశాఖ, గిరిజన, డీఓపీటీ, సామాజిక న్యాయ శాఖల సెక్రటరీల ను సభ్యులుగా నియమించింది. ఎస్సీ వర్గీకరణ అంశంపై ఈ కమిటీ ఈ నెల 23న తొలి సమావేశం నిర్వహించనున్న ట్టు తెలిసింది. మాదిగ సామాజిక వర్గాల వంటి షెడ్యూల్డ్ కులాల ప్రయోజనాలను పరిరక్షించడానికి తీసుకోవాల్సిన పాలనాపరమైన చర్యల ను ఈ కమిటీ పరిశీలించనుంది. వర్గీకరణ ద్వారా కలిగే ప్రయోజనాల్లో వారి వాటాను స మానంగా పొందడం వంటి అంశాలపై చర్చించనుంది. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎస్సీ వర్గీకరణపై కమిటీ వేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే కమిటీ వేస్తూ కేంద్రంం నిర్ణయం తీసుకుంది.