కేసీఆర్ పిలిస్తేనే చర్చలకు పోతం.. సీపీఎం, సీపీఐ నేతల సమావేశంలో నిర్ణయం

కేసీఆర్ పిలిస్తేనే చర్చలకు పోతం.. సీపీఎం, సీపీఐ నేతల సమావేశంలో నిర్ణయం
  • సీపీఎం, సీపీఐ నేతల సమావేశంలో నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్‌‌‌‌ అపాయింట్‌‌మెంట్ ఇవ్వకపోవడంపై సీపీఎం, సీపీఐ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌‌తో పొత్తు కోసం వెంపర్లాడాల్సిన అవసరం లేదని, కేసీఆర్ పిలిస్తేనే చర్చలకు వెళ్లాలని, లేదంటే కలిసి పోటీ చేయాలని నేతలు నిర్ణయించారు. శుక్రవారం హైదరాబాద్‌‌లోని ఎంబీ భవన్‌‌లో రెండు పార్టీల నేతలు సమావేశమయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌‌తో పొత్తు పెట్టుకోవద్దని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే దృష్టిపెట్టిన ఆయా సెగ్మెంట్లలో పోటీకి క్యాడర్​ను రెడీ చేయాలని సూచించారు.  
బీఆర్ఎస్‌‌తో మైత్రి ఉన్నది: తమ్మినేని
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. ఇప్పటికైతే బీఆర్ఎస్‌‌తో తమ మైత్రి కొనసాగుతున్నదని చెప్పారు. కేసీఆర్‌‌‌‌తో ఇప్పటి దాకా సీట్ల వ్యవహారంపై మాట్లాడలేదని తెలిపారు.
పొత్తు కోసం వెంపర్లాడం: కూనంనేని
బీఆర్ఎస్‌‌తో పొత్తు కోసం, వారిచ్చే సీట్ల కోసం తాము వెంపర్లాడబోమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని చెప్పారు. బీఆర్ఎస్ పిలుపు కోసం వెయిట్ చేస్తామని, వెంట రాకపోతే, సీపీఎం, సీపీఐగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు.