
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ ఉద్యోగులకు దసరా పండుగ అడ్వాన్స్ ఇవ్వాలని సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. ఆర్టీసీలోని డ్రైవర్లు, కండక్టర్లు, సూపర్ వైజర్లు, శ్రామిక్ లకు ఈ అడ్వాన్స్ ఇవ్వనున్నారు. ఉద్యోగుల హోదా, వారికి వచ్చే నెల జీతం ఆధారంగా ఈ అడ్వాన్స్ ను యాజమాన్యం ఇవ్వనుంది.
దసరా అడ్వాన్స్ లను తిరిగి వారి జీతం నుంచి నెలకు కొంత చొప్పున యాజమాన్యం వసూలు చేయనుంది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. పండుగ అడ్వాన్స్ ను వెంటనే ఉద్యోగులకు చెల్లించే ఏర్పాట్లు చేయాలని సంస్థ ఈడీలు, ఇతర అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.