సింగరేణి ఎగ్జాంలో పేర్ల తప్పులపై సంస్థ ప్రకటన

సింగరేణి ఎగ్జాంలో పేర్ల తప్పులపై సంస్థ ప్రకటన

హైదరాబాద్‌, వెలుగు: సింగరేణిలో 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాల్లో కొందరు అభ్యర్థుల పేర్లు తప్పుగా రావడంపై సంస్థ డైరెక్టర్ ఎస్.చంద్రశేఖర్ వివరణ ఇచ్చారు. తాము ఆన్ లైన్ లో మాత్రమే అప్లికేషన్లను తీసుకున్నామని, అందులోని వివరాల ప్రకారమే హాల్ టికెట్లను జారీ చేశామన్నారు. శనివారం ఫలితాలను విడుదల చేయగా.. నలుగురు అభ్యర్థుల పేరుకు బదులు రాష్ట్రం పేరు, క్వాలిఫికేషన్ వివరాలు రావడంపై మీడియాలో వార్తలు వచ్చాయన్నారు.

దీనిపై జేఎన్‌టీయూ అధికారుల‌తో మాట్లాడి, వివరాలను పరిశీలించడంతో ఆన్ లైన్ లో అప్లై చేసేప్పుడు అభ్యర్థులు తమ పేర్లను టైప్ చేయాల్సిన చోట పొరపాట్లు చేయడం వల్లే వారి పేర్ల స్థానంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, డిగ్రీ, బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని తప్పులు వచ్చాయన్నారు. ఆన్ లైన్ ప్రాసెస్ కావడంతో ఫలితాలు కూడా అవే పేర్లతో వచ్చాయని వివరించారు. నలుగురు అభ్యర్థుల అప్లికేషన్ కాపీలను మీడియాకు విడుదల చేశారు.