ప్యూర్ ఈవీకి రూ.50 లక్షల పరిహారం

ప్యూర్ ఈవీకి రూ.50 లక్షల పరిహారం

హైదరాబాద్​, వెలుగు: ఎలక్ట్రిక్​ వెహికల్స్​తయారు చేసే హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ప్యూర్ ఎనర్జీ సంస్థ సోషల్ మీడియా ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లుయెన్సర్ ఆదిత్య ప్రభాకర్పై పరువు నష్టం దావాలో విజయం సాధించింది. తప్పుడు సమాచారం ప్రచారం చేసినందుకు రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని సంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పునిచ్చింది.

ఈవీ ట్రాక్సెల్ ఎక్స్ పీ పేరుతో నిర్వహించే యూట్యూబ్ ఛానల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్యూర్ ఈవీ బ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఉద్దేశపూర్వకంగా కించపరిచినట్లు కోర్టు నిర్ధారించింది. పరువు నష్టం కలిగించే వీడియోలను తొలగించాలని బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది.