ప్రభాస్ - హృతిక్ మధ్య పోటీ!

ప్రభాస్ - హృతిక్ మధ్య పోటీ!

బిగ్ స్టార్‌‌ల సినిమా వస్తుందంటే.. వారి అభిమానుల్లో సందడి నెలకొంటుంది. తమ అభిమాన హీరోను తెరపై ఎప్పుడు చూస్తామా అని ఆతృతగా ఎదురు చూస్తుంటారు. కానీ.. అదే రోజున మరోక స్టార్ హీరో సినిమా వస్తుందంటే.. సందడి మాములుగా ఉండదు. వీరిద్దరి సినిమాలపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. బిగ్ స్టార్ల మూవీస్ రిలీజ్ అయితే రచ్చ మాములుగా ఉండదు. సినిమా రిలీజ్ అప్పటి నుంచి కలెక్షన్ల వరకు వార్ స్టార్ట్ అవుతుంది. లెటెస్ట్ గా ఇద్దరు బిగ్ స్టార్ ల చిత్రాలు ఒకే రోజు బాక్సాపీస్ పై దండయాత్రకు సిద్ధమయ్యాయి. రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ల సినిమాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 2023, సెప్టెంబర్ 28న ప్రభాస్ ‘సలార్’ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. అదే డేట్ న హృతిక్ రోషన్ చిత్రం ‘ఫైటర్’ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. 

రెబల్ స్టార్ ప్రభాస్ చిత్రం ఎప్పుడొస్తుందా ? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా ‘రాధే శ్యామ్’ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. తర్వాతి సినిమా కోసం అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ చిత్రంలో ప్రభాస్ నటిస్తున్నాడు. శృతి హాసన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ స్పెషల్ పోస్టర్ ను షేర్ చేసింది. ఇదే డేట్ న....మరో బిగ్ స్టార్ హృతిక్ మూవీ కూడా కాచుకొని కూర్చొంది. హృతిక్ రోషన్, సిద్దార్థ్ ఆనంద్ కాంబోలో ‘ఫైటర్’ మూవీ రూపొందుతోంది. వీరి కాంబినేషన్ లో బ్యాంగ్ బ్యాంగ్, వార్ లాంటి సినిమాలు వచ్చాయి.

ఫైటర్ లో హృతిక్ సరసన దీపిక పదుకునే హీరోయిన్ గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది..రిపబ్లిక్ డే కానుకగా రిలీజ్ చేద్దాం అనుకున్నా అది సాధ్యం కాలేదు. చివరకు సెప్టెంబర్ 28న ఫిక్స్ చేశారు. భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో దేశంలోనే మొదటి ఏరియల్ యాక్షన్ ఫ్రాంచైజీగా తెరకెక్కింది. చాలా వరకు యాక్షన్ సన్నివేశాలను ఏరియల్ వ్యూలో చూపిస్తారు. వీరిద్దరి సినిమాల మధ్య పోటీ నెలకొంది. అయితే.. హృతిక్ కు నార్త్ లోనే మార్కెట్ ఉందిని.. సౌత్ లో..అంతగా లేదనే టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ కు మాత్రం ఇండియా రేంజ్ లో ఇమేజ్ ఉండడంతో కేవలం హిందీలో మాత్రమే వీరిద్దరి మధ్య పోటీ ఉంటుందనే చర్చ జరుగుతోంది. మరి సలార్, ఫైటర్ లో ఎవరు గెలుస్తారో చూడాలి.