మల్లారెడ్డి కుటుంబాన్ని వేధిస్తున్న వాళ్లపై ఫిర్యాదు చేస్తం : ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు

మల్లారెడ్డి కుటుంబాన్ని వేధిస్తున్న వాళ్లపై ఫిర్యాదు చేస్తం : ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు

ఐటీ దాడులనేవి అందరికీ సహకరించే విధంగా ఉండాలి గానీ, మనుషుల్ని హింసించి, చెయ్యి చేసుకోవడం, కొట్టడం పద్ధతి కాదని మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు అన్నారు. ఐటీ దాడులను నిరసిస్తూ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మర్రి రాజశేఖర్ రెడ్డికి మద్దతుగా నిరసనలు చేశారు. నిన్నటి నుండి మంత్రి మల్లారెడ్డితోపాటు ఆయన కొడుకులు, అల్లుడు, బంధువుల ఇండ్లలో దాడులు చేయడమేంటని ప్రశ్నించారు. అందులో భాగంగా మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంటి వద్ద మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి, ఆందోళన చేశారు. 

ప్రజాస్వామ్యబద్దంగా ఎలాంటి రైడ్ అయినా చేయొచ్చు... కానీ కష్టపడి పని చేసుకునే వాళ్ళని టార్గెట్ చేయడం బీజేపీ ప్రభుత్వానికి తగదని ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు చెప్పారు. ఎవరైతే ఐటీ దాడులతో మల్లారెడ్డి కుటుంబాన్ని వేధిస్తున్నరో వాళ్లపై ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో తమకు కూడా టైం వస్తదని మండిపడ్డారు.