కేటీఆర్‌‌‌‌‌‌‌‌, హరీశ్‌‌‌‌రావుపై అడిషనల్ డీజీకి ఫిర్యాదు : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

కేటీఆర్‌‌‌‌‌‌‌‌, హరీశ్‌‌‌‌రావుపై అడిషనల్ డీజీకి ఫిర్యాదు : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
  • పోలీసులను బెదిరిస్తున్నారని ఆరోపణ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌‌‌‌ కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌రావుపై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పోలీస్‌‌‌‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ సందర్భంగా పోలీసు అధికారులను బెదిరించారంటూ పేర్కొన్నారు.ఈ మేరకు అడిషనల్ డీజీ (లా అండ్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌) మహేశ్‌‌‌‌ భగవత్‌‌‌‌కు శుక్రవారం కంప్లైంట్ అందజేశారు. 

కేసు దర్యాప్తు సమయంలో అధికారులను బెదిరించే విధంగా వ్యాఖ్యలు చేయడం సహించరానిదని అన్నారు.విచారణను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు.ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.