
- పంజాగుట్టలో కంప్లయింట్ ఇచ్చిన యువకుడు
పంజాగుట్ట, వెలుగు: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్చేసిన చిన్న యూట్యూబ్ స్టార్స్పైనే కేసులు పెడతారా? బెట్టింగ్ యాప్స్ ప్రమోట్చేసిన బాలీవుడ్స్టార్షారుఖ్ ఖాన్, క్రికెటర్లు సచిన్టెండూల్కర్, విరాట్ కోహ్లీపై పెట్టరా అని హైదరాబాద్ గ్రీన్స్ సంస్థ ప్రెసిడెంట్ అర్జున్ గౌడ్ ప్రశ్నించారు. సోమవారం ఆయన పంజాగుట్ట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఏ23 రమ్మీకి షారుఖ్ ఖాన్, పేటీఎం ఫస్ట్ గేమ్ కు సచిన్ టెండూల్కర్, ఎంపీఎల్– మిడిల్ ప్రీమియర్ లీగ్ యాప్లను ప్రమోట్చేస్తున్నారని పేర్కొన్నారు. వీటితో ఎంతో మంది టీనేజర్స్ ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు. అయితే పోలీసులు ఆయన ఫిర్యాదును స్వీకరించకుండా పంపించి వేశారు.